శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం .. ప్రాజెక్టు వద్ద పరిస్థితి ఇలా..
NEWS Jul 28,2025 04:37 am
కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. సుంకేశుల, జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. ఈ ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంకు 1,27,392 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం ఔట్ ఫ్లో 1,40,009 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.40 అడుగుల నీటి మట్టం ఉంది.