కౌశిక్ రెడ్డికి 'మెట్టు' మాస్ వార్నింగ్
NEWS Jul 28,2025 04:24 am
ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. కథలు ఎక్కువయ్యాయని, తగ్గించుకోక పోతే ఇరిచేస్తానని అన్నారు. సీఎం రేవంత్ గురించి మాట్లాడే స్థాయి నీది కాదన్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పక్క రాష్ట్రం నుంచి కిరాయి రౌడీలను తెచ్చుకున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.