అవినీతి సొమ్ము దాచుకునేందుకే బాబు టూర్
NEWS Jul 28,2025 02:33 am
అవినీతి సొమ్మును దాచుకునేందుకే చంద్రబాబు సింగపూర్ లో పర్యటిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తనను చూస్తుంటే దుబాయ్ శ్రీను మూవీ గుర్తుకు వస్తోందన్నారు. ఈశ్వరన్ తో ములాఖత్ అయ్యేందుకు అక్కడికి వెళ్లారంటూ ఆరోపించారు. ప్రజలను మోసం చేయడం మానేసి ఇచ్చిన హామీలు నిలబెట్టు కోవాలని అన్నారు. విశాఖలో విలువైన భూములను కారు చౌకగా ఇచ్చే బదులు అమరావతిలో పెట్టుబడులు పెట్టమని కోరాలన్నారు.