జగన్ రెడ్డీ శవ రాజకీయాలు మానుకో
NEWS Jul 28,2025 02:15 am
మంత్రి సవిత మాజీ సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. శవ రాజకీయాలు మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. పిల్లలకు ప్రత్యక్ష నరకం అంటూ దుష్ప్రచారం చేయటం దుర్మార్గమన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో వసతి గృహాల్లో పిల్లలు పడుతున్న నరకం మీకు కనిపించ లేదా అని ప్రశ్నించారు. తాము వచ్చాక పేరుకు పోయిన బకాయిలను చెల్లించడం జరిగిందన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్నారు. అందుకే తన పార్టీని గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేశారని, అయినా బుద్ది రావడం లేదన్నారు.