థాయ్‌లాండ్ , కాంబోడియా యుద్ధం ఆపాలి
NEWS Jul 28,2025 02:08 am
థాయ్ లాండ్, కాంబోడియా దేశాలు యుద్దాన్ని తక్షణమే ఆపాలని అన్నారు అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్. యుద్ధాన్ని ఆపుతానంటూ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. రెండు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని వెల్లడించారు. అమెరికాతో వాణిజ్యం కొనసాగాలంటే యుద్ధాన్ని ఆపాల్సిందేనని స్పష్టం చేశారు. తాను వార్నింగ్ ఇవ్వడంతో దారికి వచ్చాయంటూ పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్దాన్ని కూడా తానే ఆపానంటూ మరోసారి తెలిపారు.