బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన కామెంట్స్ బక్వాస్ అంటూ పేర్కొన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. లేనిపోని ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. ఇలాగే కామెంట్స్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. తమ పార్టీ తెలంగాణ ఉన్నంత కాలం ఉంటుందన్నారు. ఎవరితోనో కలిసే ఖర్మ తమకు పట్టలేదన్నారు.