సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు సంబంధించి ఎలాంటి అనుమతి లేదన్నారు హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె వెంకటి. తమకు తెలియకుండానే ఇది జరుగుతోందని అన్నారు. అనధికారికంగానే అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. గతంలో దీనిని రద్దు చేశామన్నారు. ఈ కేసులో సరోగసి జరగలేదన్నారు. వేరే వారి బిడ్డను ఇక్కడ బాధిత దంపతులకు ఇచ్చారని తెలిపారు.