బాబు సింగపూర్ టూర్ పై రామకృష్ణ ఫైర్
NEWS Jul 28,2025 01:11 am
ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. ఈ టూర్ వల్ల ఏపీకి ఎలాంటి లాభం ఉండదన్నారు. కేవలం ప్రభుత్వ సొమ్ము ఖర్చు కావడం తప్ప అంటూ మండిపడ్డారు. కూటమి పాలనలో ఎలాంటి మార్పు లేదన్నారు. బాబు ఇప్పటి వరకు 21 సార్లు ఢిల్లీకి వెళ్లాడని, కేంద్రం నుంచి ఏపీకి ఏం తీసుకు వచ్చాడో చెప్ప లేదన్నారు.