రైతుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
NEWS Jul 28,2025 01:07 am
ఉత్తరాంధ్ర రైతుల సంక్షేమానికి సర్కార్ ప్రయత్నం చేస్తోందన్నారు మంత్రి సుధారాణి. ఆండ్ర జలాశయం నుండి సాగునీటిని విడుదల చేశారు. మెంటాడ, గజపతినగరం, బొబ్బిలి మండలాలలోని 9,426 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందన్నారు. తక్కువ వర్షపాతం ఉన్నా రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నిర్వహణ కోసం రూ.12.31 లక్షలు మంజూరు చేశామన్నారు.