జడేజా, సుందర్ సెంచరీ 4వ టెస్టు డ్రా
NEWS Jul 28,2025 12:15 am
మాంచెస్టర్ వేదికగా జరిగిన 4వ టెస్టు డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లారు భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్. ఇండియాను ఓటమి నుంచి కాపాడారు. డ్రాగా ముగించడంలో ఈ ఇద్దరు కీలక పాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. జడేజా 107 పరుగులతో, సుందర్ 101 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు. ఆటను ఆపేద్దామంటూ బ్రూక్ చేసిన ప్రతిపాదనను వీరు తిరస్కరించారు.