పిల్లలు ఆస్పత్రి పాలైనా పట్టించుకోని సీఎం
NEWS Jul 27,2025 07:13 pm
ఓ వైపు పిల్లలు ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రి పాలవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించు కోక పోవడం దారుణమన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో గురుకుల విద్యార్థులను పరామర్శించారు. సీఎంది రాతి గుండె అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో డ్రామాలు ఆపి పిల్లల బాగోగులపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. సొల్లు కబుర్లు తప్పా రాష్ట్రానికి, ప్రత్యేకించి విద్యా రంగానికి చేసింది ఏమీ లేదన్నారు హరీశ్ రావు.