సరగోసీ పేరుతో లక్షల్లో వసూలు - డీసీపీ
NEWS Jul 27,2025 04:01 pm
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెల్లడించారు డీసీపీ రష్మీ పెరుమాల్. కొద్ది రోజుల క్రితం పిల్లల కోసం సెంటర్ ను దంపతులు కలిశారని, సరోగసి కోసం డాక్టర్ నమ్రత వారి నుంచి రూ.30 లక్షలకు పైగా వసూలు చేశారని చెప్పారు. హైదరాబాద్ నుంచి ఓ మహిళను విమానంలో విశాఖకు తీసుకొచ్చి డెలివరీ చేశారని తెలిపారు. ఆమెకు పుట్టిన బిడ్డను సరోగసి ద్వారా పుట్టిందని దంపతులను నమ్మించి మోసం చేశారన్నారు. పేద ప్రజలకు డబ్బు ఆశ చూపించి సరోగసికి ఒప్పిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు.