మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకులకు శఠగోపం పెట్టి మోసాలకు పాల్పడిన చరిత్ర ఉన్న తనకు తమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రాణం పోయినా బీజేపీతో పొత్తు ఉండదని కేసీఆర్ ఆరోజే చెప్పారని మరోసారి గుర్తు చేశారు. ఈరోజుకి కూడా అదే మాట మీద ఉన్నామన్నారు. సీఎం రమేష్ లాంటి బ్రోకర్లు చెప్పే మాటలు పట్టించు కోవాల్సిన అవసరం లేదన్నారు.