సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించిన కోరుట్ల ఎస్ఐ చిరంజీవి
NEWS Jul 27,2025 09:25 pm
సైబర్ నేరాలపై కోరుట్ల ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరు సైబర్ వలలో పడకుండా జాగ్రత్త పడాలని, ఫోన్లో వచ్చే ఎటువంటి లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. అలాగే ఎటువంటి ఫోన్స్ నుంచి గాని ఓటీపీ గాని ఇతర వివరాలు ఎవరికీ చెప్పవద్దన్నారు.