తెలంగాణకు పట్టిన శని కేసీఆర్, కేటీఆర్
NEWS Jul 27,2025 10:30 am
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాజీ మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. సీఎం రమేష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. కవితను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు రాయబారం నడిపింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని కవిత బయట పెట్టిందన్నారు. తను అడిగిన ప్రశ్నలకు ఇంతవరకూ సమాధానం చెప్ప లేదన్నారు. నువ్వు, నీ అయ్య తెలంగాణకు పట్టిన శని అంటూ ఫైర్ అయ్యారు.