తెలంగాణ కేసీఆర్ వల్ల రాలేదని దివంగత నేత సూదిని జైపాల్ రెడ్డి వల్లనే వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. పార్లమెంటులో చర్చ లేకుండానే బిల్లును ఆమోదించడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. తన వల్లనే తెలంగాణ ఏర్పాటుకు తాను ఆమోదం తెలిపానంటూ ఓ సందర్బంలో సోనియా గాంధీ తనతో చెప్పారన్నారు. జైపాల్ రెడ్డికి రాజకీయంగా ప్రత్యర్థులు ఉన్నారని కానీ వ్యక్తిగతంగా శత్రువులంటూ ఎవరూ లేరన్నారు.