తన గురించి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన కామెంట్స్ పై సీరియస్ గా స్పందించారు కేటీఆర్. సోయి లేకుండా మాట్లాడితే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదివిన నీకు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రూ. 1600 కోట్లతో కాంట్రాక్టు కొట్టేసిన సంస్థ తనదేనంటూ ఆరోపించారు. దమ్ముంటే చేసిన ఆరోపణలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.