శ్రీశైలం ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్ ఎత్తివేత
NEWS Jul 27,2025 02:19 pm
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతోంది వరద నీరు. దీంతో రేడియల్ క్రస్ట్ గేట్ పది అడుగుల మేర ఎత్తి కిందకు నీటిని వదిలారు. ఇన్ ఫ్లో 1,11,982 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 92,976 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తి స్దాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199.2737 టీఎంసీలకు వద్ద ఉంది. భారీగా నీరు ప్రాజెక్టులోకి చేరడంతో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.