పోటెత్తిన వరద సాగర్ నిండుకుండ
NEWS Jul 27,2025 08:37 am
ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం590 అడుగులు కాగా ప్రస్తుతం 582.20 అడుగుల వద్ద ఉంది. నీటి సామర్థ్్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 289. 3600 టీఎంసీల వద్దకు చేరుకుంది. శ్రీశైలం నుంచి ఇన్ ఫ్లో 1,20,339 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 35,343 క్యూసెక్కులు ఉన్నాయి. కుడి కాలువకు 511 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 4,287 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. హైదరాబాద్ తాగు నీటికి 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.