పంతుళ్లకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు
NEWS Jul 27,2025 08:32 am
తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది పంతుళ్లకు. టీచర్ల పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రమోషన్స్ ఇచ్చేందుకు గాను తయారు చేసిన ఫైల్ పై సంతకం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో SGT, స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్స్ రానున్నాయి. రెండు రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ కానుంది. సర్కార్ నిర్ణయం కారణంగా 2 వేల మందికి పైగా టీచర్లు లబ్ది పొందనున్నారు.