ఏపీకి వాతావరణ శాఖ వార్నింగ్
NEWS Jul 27,2025 08:29 am
ఛత్తీస్‌గఢ్-మధ్యప్రదేశ్ మధ్య ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని దీని కారణంగా ఏపీలో భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఏపీ వాతావరణ శాఖ. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అలర్ట్ గా ఉండాలని పేర్కొంది. ఈ క్రమంలో సముద్రంలో అలజడి ఉంటుందని స్పష్టం చేసింది. బుధవారం వరకు రాష్ట్రంలోని తీరప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.