మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్సై
NEWS Jul 27,2025 09:59 pm
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని బుచ్చయ్యపేట ఎస్ఐ ఎన్. భాస్కరరావు కోరారు. శనివారం వడ్డాది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. సిగరెట్, గంజాయి, గుట్కా, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలన్నారు. ర్యాగింగ్ కు పాల్పడితే భవిష్యత్తు పాడవుతుంది. అన్నారు. మీ భవిష్యత్తుపై దృష్టి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీదేవి, నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.