భారతీ సిమెంట్స్ లో సిట్ సోదాలు
NEWS Jul 26,2025 06:51 pm
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ కు చెందిన హైదారాబాద్ లోని బంజారా హిల్స్ లోని భారతీ సిమెంట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో సిట్ సోదాలు చేపట్టింది. డాక్యుమెంట్లు పరిశీలించారు. భారతి సిమెంట్స్ కేంద్రంగా ఏపీ లిక్కర్ స్కామ్ నడిచిందని అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన బాలాజీ గోవిందప్ప భారతి సిమెంట్ లో డైరెక్టర్ గా ఉన్నారు. రూ.3,500 కోట్ల స్కామ్ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. ఆరు డెన్లకు భారతి సిమెంట్స్ నుండి ముడుపులు తరలించినట్లు గుర్తించింది సిట్.