కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో
NEWS Jul 26,2025 04:48 pm
శాప్ చైర్మన్ శివ సేనా రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి మండిపడ్డారు. తమ నాయకుడు, సీఎం రేవంత్ రెడ్డి గురించి అనవసరంగా మాట్లాడితే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. నీ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ తమకు లేదన్నారు. నీకు దమ్ముంటే రుజువు చేయ్ అన్నారు. అర్థరాత్రి తిరిగే దుకాణం నీది, నీ కేటీఆర్ ది అంటూ ఫైర్ అయ్యారు. మీ బతుకు ఏంటో అందరికీ తెలిసిందేనన్నారు.