జిల్లాలకు రూ. 33 కోట్లు విడుదల
NEWS Jul 26,2025 04:41 pm
తెలంగాణ సర్కార్ ముందస్తుగా ఆయా జిల్లలాకు రూ. ఒక కోటి చొప్పున రూ. 33 కోట్లు రిలీజ్ చేసింది. బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తక్షణ ఉపశమన చర్యలు చేపట్టేందుకు, అవసరమైన సామాగ్రి కొనుగోలుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెవెన్యూ శాఖ. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టింది.