సీనియర్ మావోయిస్ట్ కపుల్స్ లొంగుబాటు
NEWS Jul 26,2025 01:24 pm
సీనియర్ మావోయిస్టు దంపతులు సరెండర్ అయ్యారని ప్రకటించారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా . మావోయిస్ట్ పార్టీలో సుమారు 34 సంవత్సరాలు పైగా పని చేసిన సీనియర్ మావోయిస్టు జోరిగె నాగరాజు అలియాస్ కమలేశ్ తో పాటు ఆయన భార్య మేడక జ్యోతీశ్వరి అలియాస్ అరుణ లొంగి పోయారన్నారు. కమలేశ్ ప్రస్తుతం తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్చార్జ్ పనిచేస్తూ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో SZCM హోదాలో ఉన్నారని చెప్పారు.