కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని కనిగిరి పొదిలి మార్గంలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. వేద పండితులు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పాల్గొన్నారు.