ఒక అభ్యర్థికి ఒకే నామినేషన్ మాత్రమే
NEWS Jul 26,2025 09:53 am
ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా సరే ఏదో ఒక స్థానానికి మాత్రమే నామినేషన్ వేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒకేసారి జడ్పీటీసీ, ఎంపీటీసీకి పోటీ చేయటానికి వీలు లేదంటూ పేర్కొంది. కుటుంబంలోని ఓటర్లు అందరికీ ఒకే పోలింగ్‌బూత్‌లో ఓటు హక్కు కల్పించాలని ఆదేశించింది. ఎంపీటీసీకి గులాబీ, జడ్పీటీసీ ఎన్నికకు తెలుపు బ్యాలెట్ పేపర్లు ఇస్తామని తెలిపింది. స్థానిక ఎన్నికల్లోనూ నోటా సౌకర్యం కల్పించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశించింది.