డీఎస్పీల మృతిపై అనిత, లోకేష్ దిగ్భ్రాంతి
NEWS Jul 26,2025 09:21 am
తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు ఇంటిలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావులు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రులు అనిత వంగలపూడి, నారా లోకేష్. విధుల్లో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.