నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద
NEWS Jul 26,2025 09:17 am
ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు. ఇన్ ఫ్లో 1లక్ష 20వేల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 10,294 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 579.30 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 280.98 టీఎంసీలు ఉండగా ప్రాజెక్టు పూర్తి విలువ సామర్థ్యం 312 టీఎంసీలుగా ఉంది. నీటిమట్టం మరో 10 అడుగులకు చేరుకుంది. ఇదే ఉధృతి కొనసాగితే ఇంకో 32 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరితే నిండుకుండగా మారే అవకాశం ఉంది.