తిరుమలలో పోటెత్తిన భక్తజనం
NEWS Jul 26,2025 09:11 am
తిరుమలలో భక్తుల సందడి కొనసాగుతోంది. శ్రీవారిని 73 వేల 576 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 227 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.23 కోట్లు వచ్చిందని ఈవో జె. శ్యామల రావు. శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం 12 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.