మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. HCU కంచె గచ్చిబౌలి భూముల కుంభకోణంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హస్తం ఉందని తాను ముందే చెప్పానని అన్నారు. ఇందులో భాగంగానే ఫ్యూచర్ సిటీకి రోడ్డు వేసేందుకు బీజేపీ ఎంపీకి సీఎం రేవంత్ రెడ్డి అప్పనంగా రూ. 1600 కోట్ల విలువ చేసే కాంట్రాక్టు ఇచ్చాడని ఆరోపించారు. బీజేపీకి కాంగ్రెస్ కి మద్యలొ ఉన్న ఈ లోపాయకారి ఒప్పందం ఏమిటో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్.