కేసులు పెట్టుకుంటూ పోతే జైళ్లు సరిపోవు
NEWS Jul 26,2025 08:01 am
కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాళ్లు, జైళ్లు కూడా సరిపోవు అన్నారు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. రాజకీయాలలో విమర్శలు, ఆరోపణలు, ప్రతి విమర్శలు సహజమేనని అలా అని ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు బనాయిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తనపై కేసు నమోదైంది. ఈ సందర్బంగా పోలీసులు అడిగిన 40 ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు నల్లపురెడ్డి.