పోడు భూముల జోలికి వెళితే ఖబడ్దార్ - ఎమ్మెల్యే
NEWS Jul 26,2025 07:57 am
అటవీశాఖ అధికారులపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు సంచలన ఆరోపణలు చేశారు. అడవుల్లో వెళ్లారని బీసీలను, గొర్రెలు, మేకల కాపరులను అడ్డుకుంటే తిరగ బడతారని అన్నారు. వారి తిరుగుబాటుకు తానే నాయకత్వం వహిస్తానని ప్రకటించారు.. అడవుల్లో కలప ఎలా మాయమవుతోంది అంటూ ప్రశ్నించారు గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చారు.