10 జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లు
NEWS Jul 26,2025 07:52 am
తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 10 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. నియామకం అయిన వారంతా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు. ప్రస్తుతం ప్రభుత్వం త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. అంతే కాకుండా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలయ్యేందుకు గాను వీరిని నియమించింది.