శ్రీవారి హుండీ ఆదాయం రూ. 666.26 కోట్లు
NEWS Jul 26,2025 07:45 am
టీటీడీ ఈవో జె. శ్యామల రావు కీలక ప్రకటన చేశారు. గత ఆరు నెలల్లో శ్రీవారిని 1.29 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. కానుకలు, విరాళాల రూపేణా సమర్పించిన హుండీ ఆదాయం రూ. 666.26 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే 3 లక్షల మంది భక్తుల సంఖ్య పెరిగిందని, రూ. 3 కోట్ల ఆదాయం తగ్గిందన్నారు.