ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
NEWS Jul 26,2025 07:41 am
ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. పలువురు ఐపీఎస్ లను బదిలీ చేసింది. రోడ్‌సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా మాదిరెడ్డి ప్రతాప్ ను నియమించింది. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ వెంకటరమణకు డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్ శ్రీధర్‌రావును సీఐడీ ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్.