బంగారు కుటుంబాల దత్తత: చంద్రబాబు
NEWS Jul 25,2025 06:46 pm
ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలనలో భాగంగా తాను కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటానని CM చంద్రబాబు వెల్లడించారు. పీ4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని ఆయన అన్నారు. పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పీ4లో కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా చూడటంతో పాటు సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదే అని ఆయన అన్నారు.