మిథున్ రెడ్డికి ఇంటి భోజనం
NEWS Jul 25,2025 06:45 pm
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి జైలులో ఇంటి భోజనం అనుమతించలేమని, అటెండర్ సౌకర్యం కల్పించలేమని జైళ్ల శాఖ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టైన విషయం తెలిసిందే. జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. జైలులో ప్రత్యేక వసతుల కల్పనకు కోర్టు అనుమతినిచ్చింది.