కనిగిరి మున్సిపాలిటీ లోని వార్డులలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు మున్సిపల్ కమిషనర్ పి కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. వార్డులలోని వీధులలో ఫాగింగ్ చర్యలను చేపట్టారు. ఆటోలో ఫాగింగ్ మిషన్ ద్వారా దోమల నివారణ కోసం ఫాగింగ్ ప్రక్రియను నిర్వహించారు. దోమల నివారణకు దోమతెరలు వాడాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.