రేవంత్ పదవి ఉంటుందో లేదో తెలియదు
NEWS Jul 25,2025 02:17 pm
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీసీ రిజర్వేషన్ల అంశంపై నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత పదవిని బీసీకి ఇవ్వాలని, తెలంగాణకు కూడా బీసీ నేతను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. 10 శాతం కూడా లేని సామాజిక వర్గానికి 10 మంత్రి పదవులు ఇచ్చారని, 56 శాతం ఉన్న బీసీలకు కేవలం 3 పదవులు ఇవ్వడం దారుణమన్నారు. రేవంత్ పదవి ఎప్పుడు ఊడిపోతుందో తెలియదని అన్నారు.