వర్షాల ప్రభావంపై అత్యవసర సమీక్ష
NEWS Jul 25,2025 01:48 pm
వర్షాల ప్రభావంపై మంత్రి వంగలపూడి అనిత సమీక్ష చేపట్టారు. ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి స్వయంగా పరిశీలించారు. అత్యవసర సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 ఏర్పాటు చేశామన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళ వద్దని కోరారు. వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాద హాట్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు.