కైకాల సత్యనారాయణకు హోం మంత్రి నివాళి
NEWS Jul 25,2025 10:28 am
800 సినిమాలకు పైగా నటించిన నటుడు కైకాల సత్య నారాయణ జయంతి ఇవాళ. ఈ సందర్బంగా ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు మంత్రి వంగలపూడి అనిత. వెండితెరపై నవరస నటనా సార్వభౌముడిగా విభిన్న పాత్రలు పోషించారని, తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా నిలిచి పోయారని పేర్కొన్నారు. పరిపూర్ణ నటుడిగానే కాక తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యునిగా చేసిన ప్రజాసేవ మరిచి పోలేమన్నారు.