ప్రీమియర్ షోలకు రూ. 30 కోట్లు వసూలు - పవన్
NEWS Jul 25,2025 10:18 am
తాను నటించిన హరి హర వీరమల్లు ప్రీమియర్ షోలకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్లు వసూలైనట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్. అయితే తన సినిమాను బాయ్ కాట్ చేస్తామంటున్నారని, సినిమా అంత భయ పెట్టిందా అని ప్రశ్నించారు. నెల్లూరులో చిన్న వీధుల్లో పెరిగిన వాడిని, నా సినిమా ఆపుతామంటే నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరే చెబుతున్నారని అన్నారు. నా సినిమా బాయ్ కాట్ చేస్తామంటే ఏం ఇబ్బంది లేదన్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాను బెదరనంటూ స్పష్టం చేశారు.