పెరిగిన హుస్సేన్ సాగర్ నీటిమట్టం
NEWS Jul 25,2025 10:13 am
ఎడ తెరిపి కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ నీటి మట్టం పెరిగింది. 513.24 మీటర్లకు చేరుకుంది. సాగర్ సామర్థ్యం 513.41 మీటర్లుగా ఉంది. ఇన్ ఫ్లో 1081 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 789 క్యూసెక్కుల వద్ద నిలిచింది. మరో వైపు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి.