బనకచర్లపై కేంద్రానికి తెలంగాణ లేఖ
NEWS Jul 25,2025 09:57 am
ఏపీ చేపట్టే బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ ఇచ్చిన ప్రాథమిక నివేదికపై మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అభిప్రాయం కోరింది కేంద్రం. కాగాఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన పర్యావరణ అనుమతికి వ్యతిరేకమని లేఖలో పేర్కొంది సర్కార్.