అమర్‌నాథ్ యాత్ర.. 21 రోజుల్లో 3.52 లక్షలకు పైగా మంది దర్శనం
NEWS Jul 25,2025 09:51 am
జులై 3న ప్రారంభమైనప్పటి నుంచి గత 21 రోజుల్లో అమర్‌నాథ్ యాత్ర చేస్తున్న యాత్రికుల సంఖ్య 3.50 లక్షలను దాటిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 3.52 లక్షలకు పైగా భక్తులు అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నారని వెల్లడించారు.జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి రెండు బేస్ క్యాంపులకు రెండు ఎస్కార్ట్ కాన్వాయ్‌లలో 2,896 మంది యాత్రికుల బృందం శుక్రవారం బయలుదేరిందని తెలిపారు.