రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ముసాయిదాను కేంద్ర సర్కార్ పరిశీలన నిమిత్తం పంపించారు. ఈ సందర్బంగా కేంద్ర హోం శాఖ న్యాయ సలహాను కోరారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు వీలుగా పీఆర్ చట్ట సవరణకు సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం పైగా రిజర్వేషన్లు పెంపునకు రాష్ట్రానికి హక్కు ఉందని వెల్లడించింది.