శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.49 కోట్లు
NEWS Jul 25,2025 08:50 am
తిరుమల క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 68 వేల 838 మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 212 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.49 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. స్వామి వారి దర్వనం కోసం భక్తులు 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 18 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.