మీరాలం ట్యాంక్ బ్రిడ్జి కోసం రూ.430 కోట్లు
NEWS Jul 25,2025 02:59 am
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని మీరాలం ట్యాంక్ చుట్టూ ఐకానిక్ బ్రిడ్జ్ ను నిర్మించాలని ఆదేశించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. రూ. 430 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ వంతెన నిర్మాణం వల్ల రాక పోకలకు ఇబ్బందులు తొలగి పోతాయని తెలిపారు.